వలసదారుడిపై దాడి: బహ్రెయినీ వ్యక్తి అరెస్ట్

- June 12, 2021 , by Maagulf
వలసదారుడిపై దాడి: బహ్రెయినీ వ్యక్తి అరెస్ట్

బహ్రెయిన్: కారుని వాష్ చేస్తున్న వలసదారుడ్ని కొట్టినందుకు బహ్రెయినీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తి చిత్రీకరించిన ఈ వీడియోలో, బాధితుడు కారుని వాష్ చేస్తుండగా, అటు వైపు వెళుతున్న ఇంకో వ్యక్తి అతని మీద దాడి చేశాడు. ఇద్దరి మధ్యా చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. చివరికి బాధిత వ్యక్తి కింద పడిపోయి కనిపించాడు. బాధిత వ్యక్తికి చెందిన టూల్స్ చెల్లా చెదురుగా పడి వున్నాయి. నిందితుడు చాలా దురుసుగా బాధిత వ్యక్తిపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com