తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 12, 2021
హైదరాబాద్: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది.ప్రతీరోజు లక్షకు పైగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా..పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే నమోదు అవుతున్నాయి.తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వందలకు చేరువైంది..రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,771 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.మరో 13 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా..ఇదే సమయంలో 2,384 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల 6,02,089 కి చేరింది.. రికవరీ కేసులు 5,76,487 కి పెరిగాయి.ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 3,469 కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రంలో 22,133 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









