నిహారిక మూవీ ఏప్రిల్ 8న రిలీజ్...

- March 07, 2016 , by Maagulf
నిహారిక మూవీ ఏప్రిల్ 8న రిలీజ్...

తొలి సారి మెగా ఫ్యామిలీ నుండి నిహారిక వెండి తెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, ఈ మెగా భామ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే బుల్లి తెరపై సందడి చేసిన నిహారిక తాజాగా ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నిహారిక ప్రస్తుతం ఒక మనసు అనే చిత్రంలో నటిస్తుండగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేసారు.'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' చిత్రానికి దర్శకత్వం వహించిన రామ రాజు , నిహారిక చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఇందులో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్, ఓ ప్రముఖ ఛానెల్ సంయుక్తంగా ఒక మనసు చిత్రాన్ని నిర్మించనుండగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.తాజాగా విడుదలైన ఒక మనసు ప్రీ లుక్ మెగా ఫ్యాన్స్‌ని ఫుల్ ఎైగ్జెట్‌మెంట్‌కు గురి చేస్తుండగా, ఈ చిత్ర రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com