రస్ అల్‌ఖైమా, ఫుజైరాల్లో అసాధారణ వాతావరణం
- March 07, 2016
అడ్జూటెంట్ జనరల్ రస్ అల్ ఖైమా పోలీస్ మేజర్ జనరల్ అలీ బిన్ అల్వాన్ అల్ నైమి మాట్లాడుతూ, ప్రస్తుతం నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పెట్రోల్ టీమ్స్‌ని పెంచామనీ 50 పోలీస్ టీమ్స్ పలు రోడ్లపై గస్తీ కాస్తున్నారని చెప్పారాయన. అంబులెన్సులు, రెస్క్యూ టీమ్స్, ఎయిర్ వింగ్ అధికారులతో సంప్రదించి అత్యవసర పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అసాధారణ వాతావరణ పరిస్థితులతో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మోటరిస్టులు పోలీసులకు సహకరించాలనీ, పూర్ విజిబులిటీ కారణంగా వీలైనంతవరకు రోడ్లపై ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. ఎమర్జనీ సమయాల్లో 999 లేదా 072356 600 / 072356 611 నంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఫుజారియాలో కూడా ఇవే తరహా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







