"ఐయాం వెరీ సారీ" - బాలయ్య
- March 07, 2016
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..విమర్శలు చెలరేగడంతో సారీ చెప్పడం..సెలబ్రెటీల..రాజకీయ నేతలకు అలవాటై పోయింది. తాజాగా సినీ నటుడు బాలకృష్ణ కూడా అదే బాటలో చేరిపోయారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే 'సావిత్రి' ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా లోకం మండి పడింది. కన్నెర్ర చేసింది. ఓ లాయర్ ఏకంగా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సినీ నటుడు, ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే అతడికి శిక్ష వేయాలని మహిళా సంఘాలు నినదించాయి. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
చివరకు బాలకృష్ణ స్పందించారు. తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలు తప్ప తాను ఎవర్నీ ఉద్ధేశించి చేసినవి కావని పేర్కొన్నారు. ఏ ఇంటి మహిళ అయినా తన ఇంటి ఆడపడుచేనన్నారు. తన వ్యాఖ్యలతో మహిళలు నొచ్చుకొని ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







