ఒమన్-ఇండియా మధ్య విమానాల పై స్పష్టత

- June 16, 2021 , by Maagulf
ఒమన్-ఇండియా మధ్య విమానాల పై స్పష్టత

మస్కట్: ఒమన్ మరియు భారతదేశం మధ్య విమానాల విషయమై సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టతనిచ్చింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ జారీ చేసిన నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే ఒమన్ మరియు భారతదేశం మధ్య విమానాలు నడవడం ఆధారపడి వుంటుందని సిఎఎ పేర్కొంది. భారతదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వైద్య సంబంధిత పరికరాలు, మందులు వంటివాటిని తరలించేందుకూ వీటిని వినియోగిస్తారు. పౌరులు తిరిగి ఒమన్ రావడానికి, డిప్లమాట్స్, హెల్త్ వర్కర్లు వంటివారిని ఇండియా నుంచి తీసుకొచ్చేందుకు వీటిని వినియోగిస్తారు. తక్కువ సంఖ్యలో ఒమన్ వచ్చే డిప్లమాట్లు, ఒమనీయులు, హెల్త్ వర్కర్లు వంటివారికి సంబంధించి రీ-ఎగ్జామినేషన్ కరోనా పరీక్ష విషయమై జరుగుతుంది. వారికి సంబంధిత నిబంధనల ప్రకారం క్వారంటైన్ వుంటుంది. క్వారంటైన్ సమయం ముగిశాక మరోసారి వారికి టెస్ట్ చేస్తారు. జూన్ 3 నుంచి జూన్ 13 మధ్య నడిచిన విమానాలు, వచ్చిన వారి వివరాలు ఇలా వున్నాయి.
1. ఒమన్ ఎయిర్ మొత్తంగా 14 విమానాలు నడిపింది. 58 మంది ప్రయాణీకులు రాగా, అందులో 14 మంది పౌరులు, 44 మంది విదేశీయులు. ఒక్కో విమానంలో 5 మంది కంటే తక్కువ ప్రయాణీకులున్నారు. వీళ్ళంతా మినహాించబడిన కేటగిరీలకు చెందినవారు.
2. సలామ్ ఎయిర్ ఒకే ఒక్క విమానాన్ని నడిపింది. ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే వచ్చారు.
3. ఎయిర్ ఇండియా 8 విమానాల్ని నడపగా 34 మంది ప్రరయాణీకులు వచ్చారు. ఒకరు పౌరుడు కాగా, 33 మంది విదేశీ ప్రయాణీకులు. ఒక్కో విమానానికీ 5గురి కంటే తక్కువ ప్రయాణీకులున్నారు.
4. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 11 విమానాల్ని నడపగా 47 మంది ప్రయాణీకులు వచ్చారు. వీరిలో ఇద్దరు పౌరులు, 45 మంది విదేశీ ప్రయాణీకులు. ఒక్కో విమానానికీ 5గురి కంటే తక్కువ ప్రయాణీకులున్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com