పిప్పన్ను సమస్యలకు వంట ఇంటి చిట్కా
- March 07, 2016
సాదారణంగా చాల మందిలో పిప్పి పన్ను వల్ల కలిగే బాధ అంతాఇంతా కాదు. ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. తగ్గాలంటే పెయిన్ కిల్లర్ వాడాల్సిందే. వీటి వాడకం వల్ల ఉదర సంబంధమైన సమస్యలు, దీర్ఘ కాలం వాడితే కిడ్నీ సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలూ తప్పవు. వీలైనంత వరకూ పెయిన్ కిలర్లకు దూరంగా ఉండడం చాలా ఉత్తమమం, ఈ విషయం డాక్టర్లే చెబుతున్నారు. ఇతరత్రా నాటు వైద్యుల దగ్గర పళ్ల మీద ప్రయోగాలు చేస్తే మాత్రం ప్రమాదాలు తప్పవు.ఏ అర్ధరాత్రో, మందులు అందుబాటులో లేనిచోటో ఈ నొప్పి మొదలైతే తెల్ల వారిందాకా భరించాల్సిందే. అయితే మన ఇంట్లోనే దీనికి మంచి మందు ఉందని మనలో చాలా మందికి తెలియదు. శొంఠికొమ్ము, కల్లుప్పు మెత్తగా నూరి పన్నుకు ఏర్పడిన ఖాళీలో పెడితే క్షణాల్లో నొప్పి తగ్గడమే కాదు పన్నెండు గంటల్లో వాపుకూడా తగ్గుతుంది.పెయిన్ కిల్లర్ టాబ్లెట్ కూడా ఇంత త్వరగా నొప్పిని తగ్గించలేదు. తరువాత సంబంధింత డాక్టరు వద్ద వైద్యం చేయించుకుని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడం ఉత్తమం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







