సాయికుమార్ 'చుట్టాలబ్బాయి'లో నటిస్తున్నారు
- March 07, 2016
పేరవరం గౌతమీ గోదావరి చెంతన సోమవారం 'చుట్టాలబ్బాయి' సినీ సందడి నెలకొంది. సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన నటులతో గ్రామం కోలాహలంగా మారింది. హీరో ఆది, హీరోయిన్లు నమితా ప్రమోద్, యామిని, పృథ్వి, పోసాని కృష్ణమురళి, జీవా తదితరులపై వివిధ సన్నివేశాలను దర్శకుడు వీరభద్రం తెరకెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఆర్‌టీ మూవీస్ అండ్ ఐశ్వర్యలక్ష్మి బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ధవళేశ్వరం, కడియపులంక, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో ఈ నెల 20 వరకూ షూటింగ్ జరుగుతుందని తెలిపారు.ఈ సినిమాలో ఒక విలక్షణ పాత్రలో సాయికుమార్ నటిస్తున్నారని చెప్పారు. గతంలో అహ నా పెళ్లంట, పూలరంగడు, బాయ్ తదితర చిత్రాలు నిర్మించామన్నారు.గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సన్నివేశాలను అందంగా చిత్రీకరించేందుకు ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వీరభద్రం. సంగీతం ఎస్‌ఎస్ థమన్, నిర్మాత రామ్ తలారి. - పేరవరం (ఆత్రేయపురం)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







