టెంపర్ చిత్రం రీమేక్ లో శింబు
- March 07, 2016
టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి సంచలన నటుడు శింబు రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వాలు చిత్రం తరువాత శింబు నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు. ఆ చిత్రం కూడా సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకుందన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం దర్శకుడు విజయ్‌చందర్‌తో శింబు మరోసారి కలిసి పని చేయబోతున్నారు. టాలీవుడ్‌లో జూ.ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం టెంపర్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. దీని తమిళ రీమేక్‌లోనే శింబు నటించనున్నారని సమాచారం.ఇటీవల జయం రవి, లక్ష్మీమీనన్ జంటగా మిరుదన్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మైఖెల్ రాయప్పన్ టెంపర్ చిత్ర రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.ఆయన నిర్మించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇది అవినీతికి అడ్డాగా మారిన దయా అనే ఒక పోలీస్ ఇతివృత్తంతో రూపొందిన చిత్రం. ఆ పాత్రలో ఇప్పుడు శింబు నటించనున్నారన్న మాట. ప్రస్తుతం శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు మడమయడా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి టెంపర్ రీమేక్‌కు సిద్ధం అవుతారని సమాచారం.టోనీ అండ్ గై సెలూన్ ప్రారంభం స్థానిక తేనాంపేటలోని ఎల్టమ్ రోడ్డులో నెలకొల్పిన టోనీ అండ్ గై సెలూన్ షాప్‌ను ఆదివారం సాయంత్రం నటుడు శింబు అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఇదే సెలూన్ షాప్‌లో జెర్రీస్ డెన్ పేరుతో కాఫీ షాప్‌ను కుడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెలూన్ అధినేతలు నీలిమా శ్రీరామ్ ,ఫ్రాంచైజీ చెర్రీస్ డెన్ అధినేతలలో ఒకరైన కళాపిళ్లై తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







