అపాయింట్మెంట్ ఉంటేనే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్

- June 18, 2021 , by Maagulf
అపాయింట్మెంట్ ఉంటేనే 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్

ఒమన్: కోవిడ్ వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నాకే గవర్నమెంట్ సెంటర్స్ కు వెళ్లాలని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెకండ్ ప్యాకేజీలో భాగంగా 45 ఏళ్లు అంతకుపైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..సెకండ్ ప్యాకేజీలో భాగంగా వ్యాక్సిన్ పొందాలనుకుంటున్న వారు మొబైల్ యాప్ తారాసూద్ ద్వారాగానీ లేదంటే వెబ్ సైట్ https://t.co/XK0z3FxGuZ?amp=1 లింక్ ద్వారాగానీ సుల్తానేట్లోని పలు గవర్నరేట్లలో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇదిలాఉంటే ఫస్ట్ ప్యాకేజీలో భాగంగా ఎంపిక చేసిన ప్రాధాన్య వర్గాల వారు పెద్ద సంఖ్యలో వచ్చి వ్యాక్సిన్ పొందారని ఆరోగ్య శాఖ వివరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం వారు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com