డొనేషన్లను కోరిన అల్ అల్ దఖిలియా గవర్నరేట్ హెల్త్ డిపార్ట్మెంట్
- June 19, 2021
ఒమన్: కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పెషెంట్లకు చికిత్స అందించేందుకు డోనేషన్ల రూపంలో ప్రజలు సహకరించాలని అల్ దఖిలియా గవర్నరేట్ హెల్త్ డిపార్ట్మెంట్ కోరింది. గవర్నరేట్ పరిధిలో కొద్ది రోజులుగా వైరస్ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకీ ఎక్కువ అవుతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న వారితో పాటు ఇళ్లలోనే చికిత్స అందించేందుకు ఆక్సిజన్ పరికరాలు అత్యవసరంగా మారాయి. ఆక్సిజన్ పరికరాల కొరతను అధిగమించేందుకు ప్రజలు తాము ఉపయోగించిన పరికరాలను డొనేట్ చేయాలని అల్ దఖిలియా గవర్నరేట్ హెల్త్ డిపార్ట్మెంట్ కోరింది. పరికరాలను ఇవ్వలేని వారు వాటిని కొనుగోలు చేసేందుకు డోడ్పాటు అందించాలంది. ఆక్సిజన్ పరికరాలను డొనేట్ చేయాలనుకుంటున్నవారు 92881138/95733771 నెంబర్ల ద్వారా ఇహ్షాన్ అసోసియేషన్ శాఖను సంప్రదించాలని లేదా 95211098 నెంబర్ ద్వారా నిజ్వా హాస్పిటల్ ను సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







