జులై నుంచి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అపాయింట్మెంట్లు
- June 19, 2021
సౌదీ: జులై నుంచి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అపాయింట్మెంట్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కు ఉన్న డిమాండ్ తో వ్యాక్సిన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో కింగ్డమ్ లోని వీలైనంత ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ అందించాలనే లక్ష్యంతో సెకండ్ డోస్ అపాయింట్మెంట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్ 10న ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వ్యాక్సిన్ దిగుమతి పుంజుకోవటం..కింగ్డమ్ జనాభాలో 45 శాతం మందికి తొలి డోస్ అందటంతో సెకండ్ డోస్ అపాయింట్మెంట్లను ప్రారంభించబోతోంది. అయితే..60 ఏళ్లు అంతకుమించిన వయసు ఉన్నవారితో పాటు హై రిస్క్ వారికి సెకండ్ డోస్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..ఆగస్ట్ 1 నుంచి పబ్లిక్ ఈవెంట్లు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొనాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







