51వ ఏట అడుగుపెట్టిన రాహుల్ గాంధీ..
- June 19, 2021
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం 51వ ఏట అడుగుపెట్టారు. అయితే కరోనా రెండో దశ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా రాహుల్ గాంధీ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా సహాయక చర్యలు కొనసాగించాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరినట్లు శనివారం ట్వీట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్విట్టర్‌లో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ను ప్రియమైన సోదరుడిగా స్టాలిన్ అభివర్ణించారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ దూరదృష్టి ఉన్న నేత, దేశానికి ఆశా కిరణమని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







