నర్సరీలకు కోవిడ్ 19 మార్గదర్శకాలు సవరించిన అబుధాబి
- June 21, 2021
అబుధాబి: ఎమిరేట్ లో నిర్వహించబడుతోన్న పిల్లల నర్సరీలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాల్ని అబుధాబి అథారిటీస్ సోమవారం విడుదల చేశాయి. కొత్త రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి ‘బబుల్’కీ 8 నుంచి 12 మంది వరకు చిన్నారుల సంఖ్యను పెంచారు. 45 రోజుల నుంచి రెండేళ్ళ వయసు చిన్నారుల వరకు ఇది వర్తిస్తుంది. 2 నుంచి నాలుగేళ్ళ వయసు చిన్నారులు 10 నుంచి 16 మంది ‘బబుల్’లో వుండొచ్చు. పాజిటివ్ కేసు రిపోర్ట్ అయితే బబుల్ 10 రోజుల పాటు మూసి వేయాల్సి వుంటుంది. 3 లేదా ఎక్కువ బబుల్స్ కరోనా బారిన పడితే నర్సరీ మొత్తం 10 రోజులపాటు మూసెయ్యాల్సి వుంటుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు క్లాస్ రూములో దూరం 3.5 చదరపు మీటర్లు వుండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇది 5 చదరపు మీటర్లు వుండాలి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







