విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- February 01, 2026
న్యూ ఢిల్లీ: విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విదేశీ యాత్రల ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న TCS ను 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో విదేశీ విమాన ప్రయాణాలు, టూర్ ప్యాకేజీల ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి. మధ్యతరగతి ప్రజలు మరియు పర్యాటక ప్రియులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
పన్ను నిబంధనలను సరళీకృతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేత కేసుల్లో ఇప్పటి వరకు ఉన్న జైలు శిక్ష నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, పన్ను ఎగవేతను అరికట్టడానికి జరిమానాను కఠినతరం చేశారు. ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ విధించబడుతుంది. దీనివల్ల అనవసరమైన కోర్టు కేసులు తగ్గి, పన్ను వసూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







