యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- February 01, 2026
యూఏఈః యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే ప్రకటించిన గ్రేస్ పీరియడ్ ఫిబ్రవరి 3తో ముగుస్తుందని అబుదాబి మునిసిపాలిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ఉచితం అని, TAMM ప్లాట్‌ఫామ్ ద్వారా ఏదైనా లైసెన్స్ పొందిన వెటర్నరీ క్లినిక్‌లో పూర్తి చేయవచ్చని తెలిపింది. గడువు తర్వాత నమోదు చేయని పెంపుడు జంతువుల యజమానులకు Dh1,000 జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించని వారికి Dh500 నాన్-రెన్యువల్ జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. అబుదాబిలో పెంపుడు జంతువులను వదిలివేయడం జంతు సంక్షేమ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. పెంపుడు జంతువులను వీధిలో వదిలివేసి నిబంధనలను ఉల్లంఘించిన వారికి Dh2,000 జరిమానా విధించబడుతుంది. అదే సమయంలో, జంతువులను నిర్లక్ష్యం చేస్తే యూఏఈ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 471 ప్రకారం Dh5,000 వరకు జరిమానా విధించబడుతుందని అబుదాబి మునిసిపాలిటీ గుర్తుచేసింది.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







