యూఏఈ గోల్డెన్ వీసా పొందిన తెలంగాణా వాసి
- June 23, 2021
యూఏఈ: అబుధాబికి చెందిన ప్రవాస భారతీయుడు సయ్యద్ జావీద్ షా గోల్డెన్ వీసా మంజూరు చేసింది యూఏఈ. ఈ గోల్డెన్ వీసా గడువు పదేళ్ల పాటు ఉంటుంది. పలు రంగాల్లో విశేష సేవలు, ప్రత్యేక నైపుణ్యత ఉన్నవారికి గోల్డెన్ వీసా గౌరవం దక్కుతుంది. 2019 నుంచి లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసాల మంజూరు అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల సయ్యద్ జావీద్ షా ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. బ్యాచిలర్స్ డిగ్రీ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. ఆ తర్వాత 2006లో యూఏఈ వచ్చారు. ఈ 15 ఏళ్లలో ఆయన పలు ప్రాజెక్టుల కోసం 30 దేశాలు చుట్టివచ్చారు. తన 15 ఏళ్ల కృషికి గుర్తింపుగా స్పెషల్ టాలెంట్స్ - ఆర్ట్ అండ్ సైన్స్ కేటగిరీ కింద మే 25 న ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ నుండి గోల్డెన్ వీసా పొందారు. గత వారమే షా సతీమణికి కూడా గోల్డెన్ వీసా పొందటం విశేషం. యూఏఈ గోల్డెన్ వీసా పొందటం తనకు, తన కుటుంబానికి సంతోషకరమైన పరిణామమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల కోసం ఆమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లాలని, అయితే..తనకు యూఏఈ బాగా నచ్చటంతో ఇక్కడే స్థిరపడ్డానని షా చెబుతున్నారు. యూఏఈ తనకు రెండో పుట్టినిల్లు అని అన్నారు.
తాజా వార్తలు
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!









