దుబాయ్ వెళ్లేవారికి షాక్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.

- June 23, 2021 , by Maagulf
దుబాయ్ వెళ్లేవారికి షాక్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.

దుబాయ్: జులై 6 నుండి తమ సర్వీసులను యూఏఈ కి తిరిగి ప్రారంభిస్తామని తాజాగా ప్రకటిస్తూ ఎయిర్ ఇండియా అందరికీ షాక్ ఇచ్చింది..జులై 6 దాకా ఇండియా నుండి విమానాలను అనుమతించబోమని గతంలో యూఏఈ ప్రకటించిన దాని అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది.

అయితే, జూన్ 23 నుండి ఇండియా నుండి వ్యాక్సిన్ తీసుకున్న నివాసితులని దుబాయ్ కి అనుమతిస్తూ ప్రకటన జారీ చేసింది దుబాయ్. అంతేకాకుండా జూన్ 24 నుండి దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ను షుమారు 15 నెలల తరువాత పునఃప్రారంభం అవుతున్నట్టు కూడా ప్రకటించింది దుబాయ్. ఈ ప్రకటన విడుదలైన కొద్ది గంటలకే ఎయిర్ ఇండియా తన సర్వీసులను దుబాయ్ కు జూన్ 24 నుండి తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకచించడం గమనార్హం.

దాంతో దుబాయ్ కు ప్రయాణమయ్యేందుకు ప్రవాసీయులు టిక్కెట్లను కొనుగోలు చేసే క్రమంలో ఇప్పుడు ఎయిర్ ఇండియా చేసిన ప్రకటన అయోమయానికి గురి చేస్తోంది.

"మేము ఎయిర్ ఇండియా మరియు యూఏఈ అధికారులతో సంప్రదిస్తున్నాం. వివరాలు మీకు త్వరలో అందిస్తాం" అని దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది.

మరి, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com