హఫీజ్ సయీద్ ఇంటి వద్ద భారీ పేలుడు
- June 23, 2021
ఇస్లామాబాద్: ముంబై బాంబు పేలుళ్ల మాస్టర్ మైండ్, జమాత్ ఉద్దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద ఈరోజు భారీ పేలుడు సంభవించింది. పాకిస్థాన్ లోని లాహోర్ లోని ఆయన ఇంటి వద్ద చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలవగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సయీద్ నివాసం వద్ద ఉన్న పోలీస్ పికెట్ వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. పోలీస్ పికెట్ లేకపోతే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని పంజాబ్ (పాకిస్థాన్) పోలీస్ చీఫ్ ఇనామ్ ఘనీ తెలిపారు. సయీద్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు కారణం తెలిసేంత వరకు ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో చెప్పలేమని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
మరోవైపు ఘటన జరిగిన వెంటనే అక్కడకు బాంబు స్కాడ్లు చేరుకుని సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. గాయపడిని వారిని ప్రైవేటు కార్లు, ఆటోల్లో లాహార్ లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ప్రకారం… గుర్తు తెలియని వ్యక్తి వదిలి వెళ్లిన మోటారు సైకిలు కాసేపటి తర్వాత పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల కిటీకీల అద్దాలు పగిలిపోయాయని, కొన్ని భవంతులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాంన్ని మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







