ట్రాఫిక్ ఫైన్ కట్టకపోతే జైలుకే
- June 03, 2015
ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే విదేశీయుల్ని జైలుకు పంపేందుకూ వెనుకాడబోమని రాయల్ ఒమాన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారు ఫైన్ కట్టకుండా దేశం దాటకుండా ఉండేందుకు ఎయిర్ పోర్ట్లవద్దా, బోర్డర్స్ వద్దా పటిష్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అందరిలో అవగాహన కల్పిస్తున్నా, కొందరు వాటిని లైట్‌గా తీసుకుంటున్నారంటున్న ఆ అధికారి, ఆన్లైన్లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉందనీ, ఎవరైనా తాము నిబంధనలు ఉల్లంఘించామో లేదో తెలుసుకోడానికి ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వవచ్చని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ఫైన్ చెల్లించేస్తే, లీగల్ యాక్షన్స్కి అవకాశం ఉండదని రాయల్ ఒమాన్ పోలీసులు చెప్పారు. ఒకవేళ ఫైన్ చెల్లించనిపక్షంలో 24 నుంచి 48 గంటలపాటు జైలు శిక్ష తప్పదని సూచించారు పోలీసులు. ఒమాన్‌లో జరిగిన యాక్సిడెంట్స్‌లో 816 మంది చనిపోతే, అందులో 281 మంది విదేశీయులు కాగా, 535 మంది ఒమానియన్స్. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడంలో భాగంగానే నిబంధనల్ని కఠినతరం చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు చెప్పారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









