మండే కాలం యూఏఈ లో తీవ్ర ఉష్ణోగ్రతలు
- June 03, 2015
రానున్న రోజుల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయని యూఏఈ వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే నమోదయ్యాయి. స్వీహాన్, అల్ అయిన్, అబుదాబీల్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో 50.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, అండ్ సెస్మాలజీ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి వుందనీ, వీలైనంతవరకు ఎండల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తోంది. నీడ పట్టునే ఉండటం, ఏసీ ఉపయోగించి ఇంటిని చల్లగా ఉంచుకోవడం, తగినన్ని ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల కారణంగా ‘మిడ్ డే బ్రేక్’ని ముందుగా అనుకున్నదాని ప్రకారం జూన్ 15న కాకుండా, జూన్ 7 నుంచే ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఎక్కువసార్లు నీరు, ఇతర పానీయాలు తీసుకోవాలనీ, ఫ్యాటీ ఫుడ్స్, ఆల్కహాల్, సోడా, కెఫైన్, షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ తీసుకోరాదని అధికారులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం ప్రారంభించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







