బిగ్‌బాస్ షోకి హోస్ట్ గా రాణా.!
- June 29, 2021
బుల్లితెరపై బిగ్‌బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు నాలుగు సీజన్స్‌ని కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్‌కి ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. . తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడంలేదట.
ఆయన స్థానంలో యంగ్ హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ మూడు, నాలుగు సీజన్స్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన నాగ్.. ఈ సీజన్‌కి దూరంగా ఉండాలని భావిస్తున్నాడట. దీనితో బిగ్‌బాస్ నిర్వాహకులు పలువురు యంగ్ హీరోలను సంప్రదించారట. చివరికి రానాని ఫైనల్ చేశారని తెలుస్తోంది. గతంలో రానా 'నెంబర్ వన్ యారీ'అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్ ని హోస్ట్ చేయనున్నాడని సమాచారం. అయితే దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు బిగ్‌బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







