సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన అవసరం: టి.డిజిపి
- June 29, 2021
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వర్చువల్ గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ ఫంక్షనల్ వర్టీకల్స్ అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డి.జి.పి మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని అన్నారు. నేరాల నియంత్రణ కోసం అన్ని స్థాయిల అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తూ నిందితుల అరెస్ట్, న్యాయస్థానాల ద్వారా అలాంటి వారికి శిక్షలు పడే విధంగా చేయడం ద్వారా ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకాన్ని మరింత పెంచడం, ప్రజా మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా సమర్ధవంతంగా పని చేస్తున్నామని డిజిపి తెలిపారు. రానున్న రోజులలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా, కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తదనంతర పరిమాణాలలో పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 పుస్తకాన్ని ఈ సందర్భంగా డి.జి.పి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం









