మోడెర్నా వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి
- June 29, 2021
న్యూఢిల్లీ : భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరయ్యాయి. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఏ తాజాగా మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకు భారత్ లో అనుమతి పొందిన కరోనా టీకాలలో మోడెర్నా నాలుగవది. ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు భారత్ లో గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ కూడా వాటి సరసన చేరింది. ఈ క్రమంలో, భారత ఫార్మా సంస్థ సిప్లా… మోడెర్నా వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకునేందుకు డీసీజీఏ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







