ఒమన్: ప్రవాసీయుల ఉద్యోగాలపై కోత
- June 30, 2021
మస్కట్: ఒమనైజేషన్ అమలు ప్రక్రియను వేగవంతం చేస్తుండటంతో ప్రైవేట్ రంగంలో పలువురు ప్రవాసీయలు తమ ఉపాధిని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది. అకౌంటింగ్, సేల్స్, షాపుల్లోని సామాగ్రి నిర్వహణ వంటి కొలువులు జులై 20 నుంచి ఒమనీలకే పరిమితం కానున్నాయి. రెండు మంత్రి వర్గ తీర్మానాలు (2021/8), (2021/9) మేరకు ప్రైవేట్ కంపెనీలు, సంస్థల్లో పలు ఉద్యోగాలు కేవలం ఒమనీలకే కేటాయించే ప్రక్రియను షురు చేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ పౌరులకు ఉపాధి అవకాశాలను పెంచటమే మంత్రివర్గ ప్రధాన లక్ష్యం. కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒమనీలకే పరిమితం కానున్న ఉద్యోగాలు వివరాలు ఇలా ఉన్నాయి.
* ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ కంపెనీల్లో ఫైనాన్స్, అడ్మినిస్ట్రేటీవ్ ప్రోఫిషనల్స్
* అకౌంటింగ్, నగదు మార్పిడి, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, దుకాణాల్లో వస్తువుల అమరిక మాల్స్ నిర్వహణ ఉద్యోగాలు
* కార్ ఏజెన్సీలలో అకౌంటింగ్, ఆడిటింగ్ ఉద్యోగాలు
* కారు ఏజెన్సీలలో కొత్త కార్లు, వాడిన కార్ల అమ్మకాలు..కారు ఏజెన్సీలతో అనుబంధంగా ఉండే కొత్త కారు విడి పరికరాల అమ్మకాల ఉద్యోగాలు
* అన్ని రకాల వాహనాల డ్రైవింగ్, చమురు ఇంధనాల రవాణా, వ్యవసాయ, అహార పదార్ధాల ఉత్పత్తులు..అమ్మకాలు
ఒమనైజేషన్ లో భాగంగా మంత్రివర్గం నిర్ణయించిన నిష్పత్తి మేరకు ఆయా రంగాల్లోని ఒమనీలకు ఉపాధి అవకాశాలను కల్పించాల్సి ఉంటుంది. మంత్రివర్గం నిర్ణయాన్ని ప్రైవేట్ సంస్థలు అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలకు సమాచారం అందించేందుకు వాట్సాప్ నెంబర్ 99883838ను అందుబాటులోకి తీసుకొచ్చింది కార్మిక శాఖ.
తాజా వార్తలు
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







