దుబాయ్: 24/7 రెసిడెన్సీ వీసా సర్వీస్ ప్రారంభం
- June 30, 2021
దుబాయ్: రెసిడెన్సీ వీసా, ఎంక్వైరీ, ఇతర సేవలను మరింత సరళతరం చేస్తూ యూఏఈ కొత్త సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించింది. 'యూ ఆర్ స్పెషల్'(మీరు మాకు ప్రత్యేకం) పేరుతో ప్రతి రోజూ 24 గంటల పాటు ఈ సేవా కేంద్రంలోని సర్వీస్ టీం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జులై 7 నుంచి యూ ఆర్ స్పెషల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నివాస, విదేశీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. వారంలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా కంపెనీలు, పౌరులు, ప్రవాసీయులు వ్యక్తిగతంగా రెసిడెన్సీ సర్వీస్, ఇతర ఎంక్వైరీలకు సంబంధించిన దరఖాస్తులను యూ ఆర్ స్పెషల్ టీం స్వీకరిస్తుంది. అలాగే దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుంది. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు ఏకీకృత సేవా కేంద్రం ఏర్పాటుకు పురికొల్పిందని, దీంతో యూఏఈ, ముఖ్యంగా దుబాయ్ ని డిజిటల్ సేవా రంగంలో మరింత ప్రత్యేకతను చాటుకునేలా చేస్తుందని GDRFA డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మరి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







