ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలుపై నిఘాకు ప్రత్యేక బృందాలు

- July 04, 2021 , by Maagulf
ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలుపై నిఘాకు ప్రత్యేక బృందాలు

బహ్రెయిన్: వేసవిలో పగటి పూట బహిరంగ ప్రాంతాల్లో పని నిషేధం అమలుపై నిఘా వేసేందుకు జాతీయ మానవ హక్కుల సంస్థ-NIHR ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కార్మిక చట్టాల మేరకు వేసవి కాలం జులై, ఆగస్టు మాసాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి 4 గంటల వరకు కార్మికులతో ఎండ తగిలే ప్రాంతాల్లో పనులు పురమాయించొద్దు. ఈ మేరకు ప్రతి ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా వేసవిలో ఔట్ డోర్ వర్క్ బ్యాన్ ను అమలు చేస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..మంత్రిత్వ శాఖ ఆదేశాలు పకడ్బందీగా అమలు చేస్తున్నారా..లేదా పర్యవేక్షించేందుకు NIHR వరుసగా మూడో ఏడాది కూడా బృందాలను ఏర్పాటు చేసింది. ఎవరైనా వర్క్ బ్యాన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫోటో తీసి ఫిర్యాదు చేయవచ్చాని NIHR పేర్కొంది. లేదా ఉల్లంఘన జరిగిన ప్రాంతం, సమయం వంటి వివరాలతో NIHR వాట్సాప్ నెంబర్ 17111666కు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. లేదంటే NIHR హాట్ లైన్ నెంబర్ 8000114 కి ఫోన్ చేసిగానీ, ఈ మెయిల్ [email protected] ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com