విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
- July 05, 2021
అబుధాబి: కోవిడ్ నేపథ్యంలో తమ ఎమిరేట్ కు వచ్చే యూఏఈ పౌరులు, ప్రవాసీయులకు సంబంధించి ట్రావెల్ ప్రోటోకాల్ ను అప్ డేట్ చేస్తున్నట్లు అబుధాబి ప్రకటించింది. గ్రీన్ లిస్ట్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే పౌరులు, ప్రవాసీయులు తమ ప్రయాణానికి ముందు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ ను వెంట తెచ్చుకోవాలని సూచించింది. గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వారు నెగటీవ్ రిపోర్ట్ తో వస్తే క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే..అబుధాబి చేరుకున్న ఆరో రోజున మాత్రం మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అదే గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాలో లేని దేశాల నుంచి వచ్చేవారు మాత్రం పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించటంతో పాటు వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఆరో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే...ఈ నిబంధనలు అన్ని వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకొని 28 రోజులు ముగిసిన వారికి మాత్రమే వర్తిస్తాయి.
ఇక వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు ఒకవేళ గ్రీన్ లిస్ట్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వస్తే క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయాణ సమయంలో పీసీఆర్ టెస్ట్ వెంట తీసుకురావాలి. అలాగే అబుధాబి చేరుకోగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. తిరిగి ఆరో రోజున, పన్నేండో రోజున రెండుసార్లు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. గ్రీన్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ వెంటతెచ్చుకోవటంతో పాటు.. 12 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. అబుధాబి చేరుకున్న 11వ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







