తెలంగాణ: రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం
- July 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల పాటు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ కూడా నిలిచిపోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవలు అంతకంతకు పెరుగుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లై (యూపీఎస్) సామర్థ్యం సరిపోవడం లేదు. ఇది ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో దాని స్థాయిని పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. దీంతో కొత్త యూపీఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్న ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ సమాచారాన్ని అందించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







