పెట్రోల్ 512: అత్యంత వేగంగా స్పందించే దుబాయ్ పోలీస్ వింగ్

- July 10, 2021 , by Maagulf
పెట్రోల్ 512: అత్యంత వేగంగా స్పందించే దుబాయ్ పోలీస్ వింగ్

దుబాయ్: దుబాయ్ పోలీస్, పెట్రోల్ 512 విభాగం అధికారుల్ని ఇటీవల సన్మానించింది. అత్యంత వేగంగా ఆయా ఘటనలపై స్పందించినందుకుగాను ఈ గౌరవాన్ని పెట్రోల్ 512 విభాగం దక్కించుకుంది. కేవలం ఒక నిమిషం 17 సెకెండ్లలోనే స్పందించింది ఈ టీమ్. నిజానికి, టార్గెట్ రెస్పాన్స్ టైమ్ 2 నిమిషాల 48 సెకెండ్లు కావడం గమనార్హం. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, అల్ మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్ అధికారుల్ని 2020 సంవత్సరానికిగాను అత్యంత వేగంగా స్పందించిన టీంగా గుర్తించి సన్మానించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ ఖాలిల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి, తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవాన్ని అందుకున్న టీమ్ సభ్యులు, ఉన్నతాధికారులకు కృతజ్నతలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com