బిజెపి తెలంగాణ NRI సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

- July 11, 2021 , by Maagulf
బిజెపి తెలంగాణ NRI సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ ఛైర్మన్ తోపాలి శ్రీనివాస్ సూచనతో తెలంగాణ బిజెపి ఎన్అర్ఐ సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాలైన ఒమన్,యూఏఈ,ఖతార్,కువైట్,బహ్రెయిన్,సౌదీ అరేబియాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ... బండి సంజయ్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, త్వరలో తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని,వారి ఆధ్వర్యంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 ఒమన్: కన్వీనర్ మంచుకట్ల కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకల్లో నరేంద్ర పన్నీరు,మర్గపు రమేష్, శ్యాం మామిడి, వేమన్ కుమార్ కాశ, కార్తీక్ వంకాయల తో పాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

యూఏఈ: కన్వీనర్ వంశీ గౌడ్ సూచనతో మల్లేష్ గౌడ్ కోరేపు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ వేడుకల్లో మోతె రాములు,రవి కటుకం,మల్యాల శ్రీనివాస్, నవనీత్ గాజ, వెంకట స్వామి,ఎల్కపల్లి శ్రీనివాస్, మహేష్ మూఢ, నరేష్, నగేష్ జడ, గంగాధర్, వంశీ పాల్గొన్నారు.

ఖతార్: కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకల్లో నరేష్ పంచిత,శేఖర్,మహేష్,శివప్రసాద్ నారన్న పాల్గొన్నారు.

కువైట్: క్యాతం రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకల్లో నరేందర్,మహేష్,కనకయ్య,కమలాకర్,సురేష్,గంగిరెడ్డి,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సౌదీ అరేబియా: లక్షినారాయణ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ వేడుకల్లో నవీన్, సంద సామి,నాజీర్, దిలీప్, గోపి, శేఖర్,రాజు పాల్గొన్నారు.

బహ్రెయిన్: కన్వీనర్ డా.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేకు కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి బహ్రెయిన్ ఎన్.ఆర్.ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ వెంకట్ రెడ్డి,కో-కన్వీనర్లు లు ప్రేమ్ సాగర్, వెంకట్ స్వామి, శ్రీనివాస్ గుప్త,జనరల్ సెక్రెటరీ గంగాధర్ రావు,కల్చరల్ సెక్రటరీ శ్రీనాథ్ రెడ్డి,మెంబర్షిప్ సెక్రటరీ విట్టల్, నరేష్,రమేష్ మరియు బహ్రెయిన్ జనసేన కో-ఆర్డినేటర్ రాయుడు,వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com