దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సీనియర్ హీరో సుమన్
- July 11, 2021
ముంబై: దక్షిణాది సీనియర్ నటుడు సుమన్ కు అరుదైన గౌరవం లభించింది. భారత దేశంలో సినీ ప్రముఖులకు ఇచ్చి అత్యంత ప్రతిష్టాత్మ అవార్డు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం ఈసారి సుమన్ ను వరించింది. ఆదివారం ముంబై లో జరిగిన పురష్కారా ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో దక్షిణాది నుంచి సుమన్ ఈ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు ను దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్..సుమన్‌కు అందజేశారు తనకు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు దక్కడంపై సుమన్ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నటుడిగా తన ఎదుగుదల కు సహకరించిన ప్రతి ఒక్కరికి సుమన్ కృతఙ్ఞతలు తెలిపారు.
కర్ణాటకకు చెందిన సుమన్ యాక్షన్ హీరోగా వెండి తెరపై అడుగు పెట్టారు. హీరో, సహాయ నటుడు, విలన్ ఇలా ఏ పాత్రనైనా సరే సుమన్ తనదైన శైలి నటిస్తూ ప్రేక్షకులను కట్టుకున్నారు. ఇక అన్నమయ్య సినిమాలో ‘వేంకటేశ్వరస్వామి’ గా, రామదాసు లో శ్రీరాముడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక శివాజీ సినిమాలో సుమన్ పండించిన విలనిజం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సుమన్ ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. సుమన్ శిరీష ని పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక కుమార్తె. నటుడిగానే కాదు రాజకీయాల్లో కూడా సుమన్ తనదైన ముద్ర వేశారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







