విదేశాల్లో చిక్కుకుపోయి వీసా గడువు ముగుస్తుంటే ఏం చెయ్యాలి?

- July 12, 2021 , by Maagulf
విదేశాల్లో చిక్కుకుపోయి వీసా గడువు ముగుస్తుంటే ఏం చెయ్యాలి?

యూఏఈ: కోవిడ్ నేపథ్యంలో యూఏఈతో పలు దేశాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయాయి. రెగ్యులర్ ఫ్లైట్స్ రద్దు కావటంతో ఇండియా వంటి దేశాల నుంచి యూఏఈ వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే..ఫ్లైట్స్ పునరుద్ధరించే సమయానికి విదేశాల్లో ఉన్న యూఏఈ ప్రవాసీయుడి కుటుంబం రెసిడెన్సీ వీసా గడువు ముగిసే దశలో ఉంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నే ఓ యూఏఈ ప్రవాసీయుడు లేవనెత్తాడు. తన కుటుంబం ప్రస్తుతం భారత్ లో ఉంది. ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోవటంతో వారు యూఏఈ చేరుకునే మార్గం లేకుండా పోయింది. కానీ, కొద్ది రోజుల్లోనే అతని కుటుంబ సభ్యుల రెసిడెన్సీ వీసా గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు ఫిజికల్ గా హజరుకాకుండానే రెసిడెన్సీ వీసాను ఎలా పొందే అవకాశాలు ఉన్నాయా అన్నది అతని ప్రశ్న.

యూఏఈ ప్రవాసీయుడి సందేహాంపై స్పందించిన అధికారులు..ఫ్లైట్ సర్వీసుల రద్దు కారణంగా మీ కుటుంబం భారత్ లో చిక్కుకున్న పక్షంలో వీసా గడువు ముగియకముందే వారి రెసిడెన్సీ వీసాలను రద్దు చేసుకోని...ఫ్లైట్ సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కొత్తగా రెసిడెన్సీ వీసాల కోసం అప్లై చేసుకుంటే ఉత్తమమని సలహా ఇచ్చారు. ఫస్ట్ వేవ్ సమయంలో కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమైన విషయం తెలిసిందే. అయితే..విదేశాల్లో చిక్కుకొని..రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారికి ప్రత్యేకంగా ఎంట్రీ అవకాశం కల్పించింది యూఏఈ. వీసా గడువు ముగిసినా నిర్ణీత కాలపరిమితిలోపు యూఏఈ చేరుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. అయితే..ఐడెంటిటి& సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ(ICA) నుంచిగానీ, ఇతర సంబంధిత అధికార విభాగం నుంచిగానీ ప్రస్తుతం ఎలాంటి వెసులుబాటు ప్రకటనలు లేవన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. అందుకే విదేశాల్లోనే ఉండిపోయిన కుటుంబ సభ్యుల వీసా గడువుకు ముందే వీసాలను రద్దు చేసుకోవటం ఉత్తమమని సూచించారు.

వీసాల రద్దు కోసం దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-GDRFAను సంప్రదించి, మీ పాస్‌పోర్ట్, యూఏఈ రెసిడెంట్ ఐడి కార్డుతో పాటు, కంప్యూటరైజ్ చేయబడిన మీ కుటుంబ సభ్యుల రెసిడెన్సీ వీసాలను సమర్పించాలని అధికారులు వివరించారు. యూఏఈ ఔట్ సైడ్ కేటగిరిలో వీసా రద్దును కోరవచ్చని తెలిపింది. ఇండియా-యూఏఈ మధ్య తిరిగి ఫ్లైట్ సర్వీసులు సాధారణ స్థితిలో ప్రారంభం కాగానే కొత్తగా రెసిడెన్సీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com