ఒమన్ చేరుకున్న సుల్తాన్, సౌదీ ఆతిథ్యంపై ప్రశంసలు
- July 13, 2021
మస్కట్: రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ వెళ్లిన ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్..తన పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. సౌదీలోని మెజెస్టి సుల్తాన్ నియోమ్ బే విమానాశ్రయంలో ఉప ప్రధాని, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సాదర వీడ్కోలు పలికారు. తన పర్యటన అనంతరం సౌదీ ఆతిథ్యంపై సుల్తాన్ ప్రశంసల వర్షం కురిపించారు. సౌదీ రాజు, అతని బృందం ఆతిథ్యానికి హృదయపూర్వక ప్రశంసలను వ్యక్తం చేశారు. కింగ్ సల్మాన్ ఆయుఆరోగ్యాలతో ఉండాలని అల్లాను ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఇక తన పర్యటన ఫలవంతంగా, సానుకూల దృక్పథంతో ముగిసినట్లు ఆయన వెల్లడించారు. ఇరు దేశాల మధ్య చారిత్రక బంధం మరింత పటిష్టం చేసేలా, ఇరు దేశాల ప్రజలకు పరస్పర ప్రయోజనం చేకూరేలా చర్చలు, ఒప్పందాలు జరిగినట్లు వివరించారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







