కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..50 మంది మృతి
- July 13, 2021
ఇరాక్: ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. 70 పడకలతో మూడు నెలల క్రితమే ఈ వార్డును ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాజధాని బాగ్ధాద్లోని కోవిడ్ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ ఘటనలో 82 మంది మృతి చెందగా, 110 మందికి గాయాలయ్యాయి.
Fire in #Nasiriyah Al-Hussein hospital’s #COVID19 isolation ward kills over 50 people. Cause of fire is unclear but reports suggest fire erupted following oxygen tank explosion. #Iraq #CoronavirusPandemic
— The World Reviews (@tworldreviews) July 13, 2021
pic.twitter.com/MWhCiRPSGU
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







