‘ఒకే ఒక జీవితం’ స్నీక్ పీక్ విడుదల
- July 15, 2021
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’.. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి స్నీక్ పీక్ విడుదల చేశారు. ఈ వీడియోలో పాట పాడమని కొందరు ఆదిని కోరడంతో పాటు, కొన్ని సంగీత పరికరాలను చూపించారు. ఆ తర్వాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ ప్రోమో ముగిసింది. చివరలో శర్వానంద్ గిటార్ వాయిస్తూ కనిపించారు. ఇందులో అక్కినేని అమల కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







