మూడ్రోజులు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు బంద్

- July 18, 2021 , by Maagulf
మూడ్రోజులు కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు బంద్

దుబాయ్: ఈద్ అల్ అధా సెలవుల కారణంగా మూడ్రోజుల పాటు దుబాయ్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు బంద్ కానున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు వ్యాక్సినేషన్ సెంటర్లు మూసివేయనున్నట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. తిరిగి జులై 22న ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అల్ గార్హౌడ్ సెంటర్ జూలై 22 నుండి జూలై 24 వరకు ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉండగా, అప్‌టౌన్ మిర్దిఫ్ సెంటర్ జూలై 22న ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని డీహెచ్ఏ తెలిపింది. జూలై 23 మరియు జూలై 24 న మిర్దిఫ్ వ్యాక్సిన్ సెంటర్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుందని స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com