భారత్-యూఏఈ ప్రయాణం పై అప్డేట్ ఇచ్చిన ఎమిరేట్స్
- July 18, 2021
యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ అధికారిక ఎయిర్‌లైన్స్ సంస్థ ఎమిరేట్స్. ఈ క్రమంలో, కనీసం జులై 25 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది ఎమిరేట్స్. అంతేకాదు..గత 14 రోజుల్లో భారత్ కు వెళ్లిన వారికి...ఇతర ఏ దేశం మీదుగానైనా యూఏఈకి వచ్చేందుకు అనుమతి నిరాకరించబడుతుందని వెల్లడించింది. అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







