ఏపీ కరోనా అప్డేట్

- July 18, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే..ఆ కేసుల సంఖ్య ఇవాళ కాస్త పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,974 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 17 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో.. 3,290 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,37,201 కు చేరుకోగా.. రికవరీ కేసులు 18,99,361 కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,132 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 1,05,024 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com