Ehteraz లో ప్రీ రిజిస్టర్ చేసుకుంటే బోల్డన్ని బెన్ఫిట్స్
- July 19, 2021
ఖతార్: విదేశాల నుంచి తిరిగి వచ్చే పౌరులు, ప్రవాసీయులు ఎతెరాజ్ లో ప్రీ రిజిస్టర్ చేసుకొని..తగిన ప్రయోజనాలు పొందాలని ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఎతెరాజ్ యాప్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షనలే అయినా..ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవటం ద్వారా తమ ప్రయాణం మరింత సజావుగా ఉంటుందని, అలాగే చెక్ పాయింట్లు, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల దగ్గర వేచి చూసే సమయం ఆదా అవుతుందని వివరించింది. ప్రీ రిజిస్టర్ చేసుకున్నవారి డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే వారి కోసం ఫాస్ట్ ట్రాక్ రూట్ ద్వారా నేరుగా వెళ్లే సౌలభ్యం ఉంటుందని వెల్లడించింది. ఎతెరాజ్ యాప్, వెబ్ సైట్ లో ప్రీ రిజస్టర్ చేసుకునేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, పీసీఆర్ రిపోర్ట్ వివరాలతో పాటు వెబ్ సైట్ లో సూచించిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణికులు అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లను అధికారులు ముందస్తుగానే పరిశీలించేందుకు వీలుంటుంది. అన్ని సజావుగా ఉంటే ఖతార్లో ఫ్లైట్ దిగగానే...వారి ఎంట్రీ స్మూత్ గా జరిగేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ప్రయాణానికి అభ్యంతరం తెలుపుతూ ముందుగానే దరఖాస్తుదారుడికి మెసేజ్ అందుతుంది. దీంతో ఖతార్ కు వెళ్లి అతను ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల నుంచి బయటపడొచ్చు.
అయితే..కొన్ని సందర్భాల్లో మాత్రం ఆరోగ్య శాఖ రివ్యూ తప్పకపోవచ్చు. ఉదాహరణకు ఫ్యామిలీలో అందరూ ఎతెరాజ్ లో ప్రీ రిజిస్టర్ చేసుకున్నా..తల్లిదండ్రులు వ్యాక్సిన్ తీసుకొని పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వని పక్షంలో వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాతే అనుమతిస్తారు. ఎదైనా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉంటే క్వారంటైన్ తరలిస్తారు. రిజిస్టర్ చేసుకున్నవారి వివరాలను స్టోర్ అయి ఉంటాయి కనుక.. ఫ్యూచర్లో ప్రయాణ దరఖాస్తుల సమయంలోనూ ఇదే డేటాతో త్వరగా అనుమతులు పొందవచ్చు. ఇదిలాఉంటే..ఖతార్ ప్రయాణికుల్లో పౌరులు, ప్రవాసీయులకు ఎతెరాజ్ లో ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షనల్ అయినా..పర్యాటకులు మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఖతార్ బయల్దేరే సమయానికి కనీసం 12 గంటల ముందు ప్రీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







