ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళన
- July 19, 2021
అమరావతి: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ తాడేపల్లిలోని సీఎం జగన్ అధికారిక నివాసం వద్ద టీడీపీ అనుబంధ విభాగాలు, పలు సంఘాల విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత అక్కడకు చేరుకుంటున్నారు. దీంతో పాత టోల్గేట్ చౌరస్తా వద్ద వారిని పోలీసులు అడ్డుకుంటుండడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది.
పలువురిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలతో పాటు దాదాపు 1,000 మంది పోలీసులు మోహరించారు. నిన్నటి నుంచే పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థులు వాటిని లెక్కచేయకుండా తాడేపల్లి వచ్చారు. గుంటూరు జిల్లాకు వస్తున్న వారిని గుర్తించడానికి పోలీసులు డ్రోన్ కెమెరా వాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ లో అతి తక్కువ ఉద్యోగాలు పేర్కొనడం ఏంటని విద్యార్థులు మండిపడుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







