స్పాన్సర్ ను పొడిచిన కేసులో ప్రవాసీయుడి అరెస్ట్
- July 20, 2021
కువైట్: మూడు నెలల క్రితం తన స్పాన్సర్ పై హత్యాయత్నం చేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు కువైట్ పోలీసులు. సాధారణంగా నిర్వహించే సెక్యూరిటీ చెక్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నిందితుడు తారసపడ్డాడు. అతని తీరు అనుమానస్పదంగా ఉండటంతో మరింత లోతుగా అతన్ని ఎంక్వైరీ చేశారు. అతని దగ్గర్నుంచి సేకరించిన వివరాలతో తాను బంగ్లాదేశీ డ్రైవర్ అని, ఓ మహిళా స్పాన్సర్ పై హత్యాయత్నం కేసులో వాంటెడ్ గా ఉన్నాడని నిర్ధారించుకున్నారు. మహిళా స్పాన్సర్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్న నిందితుడు..ఆమె శరీరంపై పలు చోట్ల పొడిచి గాయపరిచాడు. అయితే..సకాలంలో ఆమెను ఆస్పత్రిలో చేర్చటంతో చికిత్స తర్వాత కోలుకుంది. అప్పటి నుంచి హత్యాయత్నం కేసులో నిందితుడైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు సెక్యూరిటీ చెకింగ్ లో పట్టుబడ్డాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







