లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం జనం క్యూ
- July 20, 2021
ఒమన్: ఒమన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో జనం నిత్యావసరాల కోసం క్యూ కట్టారు. కర్ఫ్యూ రోజుల్లో బయటికి వచ్చేందుకు అవకాశం ఉండదు కనుక తమకు కావాల్సిన వస్తువులను ముందే తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో సోమవారం సూపర్ మార్కెట్లు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసరాల వాణిజ్య కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచే మస్కట్ లోని సూపర్ మార్కెట్లు, ఇతర నిత్యావసర సరుకుల వాణిజ్య కేంద్రాలకు కస్టమర్లు క్యూ కట్టారు. పాల ట్రక్కులు వచ్చిరాకముందే పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టి తమ కోటా పాలను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ఒమన్ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు పాక్షిక లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు జూన్ 23 వరకు పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది ఒమన్. అత్యవసర వాహనాలు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపులకు మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చే వారికి కూడా లాక్ డౌన్ సమయంలో ప్రయాణించొచ్చు. అయితే..విదేశీ ప్రయాణికులు తమ ట్రావెల్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







