మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు
- July 20, 2021
మిజోరం: మిజోరం గవర్నర్‌గా ఇటీవల నియమితులైన కంభంపాటి హరిబాబు నిన్న సాయంత్రం గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో గువాహటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ జోథాన్‌ఖుమా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిజానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంసు ధులియా ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. అయితే, ఆయన కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతుండడంతో ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయారు. హరిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంథంగా, మంత్రులు, అధికారులతోపాటు హరిబాబు భార్య జయశ్రీ, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







