భారీ వర్షం కారణంగా ఒమన్ లో 6 గురు మృతి
- March 10, 2016
అకాల వరదలు గల్ఫ్ ప్రాంతంలో జన జీవనాన్ని గందరగోళానికి గురిచేశాయి.యుఎఇలో వార్షిక వర్షపాతం 78 మిల్లీమీటర్ల కాగా... 294 మిల్లీమీటర్లు కేవలం బుధవారం ఒక్క రోజునే నమోదు కాబదినట్లు వాథావరణశాఖ తెలిపింది. ఉత్తర మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కుండపోత వర్షం ఈ వారం రోజుల వ్యవధిలో ఆరుగురు మృతికి కారణం అయ్యందని స్థానిక మీడియా తెలిపింది. ఉత్తర నిజ్వా జిల్లాలో భారీ వర్షం కారణంగా సంభవించిన వరదలకు కొట్టుకుపోయిన ఒక మృతదేహాన్నిఒమాన్ పోలీసులు కనుగొన్నట్లు గురువారం తెలిపింది. వాయువ్య ప్రాంతం ఆల్-బురిం లో బురద లోనికి దిగబడిన కారులో మరొక శవాన్ని కనుగోనినట్లు శబిబ డైలీ లో నివేదించారు. ఈ రెండు మరణాలతో ఒమాన్ లో వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య అయిదుకు చేరినట్లు ఒమాన్ పోలీసులు పేర్కొంటున్నారు. ఉరుముల తుఫానులు సంభవిస్తుంటాయి ఆదివారం నుంచి ఉత్తర సుల్తాన్ ప్రాంతాలను ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం తాకింది ఇక్కడ వాతావరం అటువంటి ఉపద్రవాలకు ఈ ప్రాంతం అనుకూలం. వరదలలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిచెందుకు, కార్లను తాళ్ళను ఉపయోగించి వెలుపలకు లాగుతున్న పలు దృశ్యాలు సోషల్ మీడియా లో పోస్ట్ చేయబడ్డాయి. అలాగే , మస్క్యాట్ అనేక ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో హట్టా సరిహద్దు ప్రాంతంలో ఒక కారులో చిక్కుకొన్న 7 ఏళ్ళ బాలుడు బుధవారం వరదల నీటిలో చిక్కుకొని మరణించినట్లు నేషనల్ డైలీ నివేదించింది. దుబాయ్ లో.... గురువారం వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ అనేక వీధుల్లో వర్షం వరదల తాలుకా నీళ్ళు రోడ్లపై ఎటు కదలకుండా ఉన్నాయి.అబూ ధాబీ విమానాశ్రయం వద్ద విమానాలను బుధవారం పలు గంటలు వాయిదా వేశారు. ఎమిరేట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మందకొడిగా సాగుతోంది. అనేకమంది వ్యాపారులకు స్టాక్ మార్కెట్ వ్యాపార కూడలికి చేరుకోవడానికి వీలు కాలేదు. దీంతో అన్ని ఉదయం ఒప్పందాలు రద్దు చేశారు. తుపాను కారణంగా గల్ఫ్ దేశాల్లో పాఠశాలలు బుధవారం నుంచి మూతపడ్డాయి. యుఎఇలో వార్షిక వర్షపాతం 78 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది కానీ వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ నేషనల్ సెంటర్ తెలిపిన సమాచారం మేరకు 294 మిల్లీమీటర్లు కేవలం బుధవారం ఒక్క రోజునే నమోదు కాబదినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







