సిని పరిశ్రమలో రాజకీయ శక్తులు

- March 11, 2016 , by Maagulf
సిని పరిశ్రమలో రాజకీయ శక్తులు

అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. అంటూ కథా స్క్రీన్ ప్లే డైరక్షన్ అప్పారావు సినిమాలో రాం గోపాల్ వర్మ చెప్పిన మాటలు ఊరకనే అన్నారా.. ఏదో సరదాకి ప్రాసకి రాసుకున్న పదాలేనా ఇవన్ని.. టాలెంట్ ఎక్కడుంటే అవకాశాలు అక్కడే అనే నమ్మకం మీద ఉన్న యువ జోరుకి సిని పరిశ్రమలో రాజకీయ శక్తులు షాక్ ఇవ్వనున్నాయా.. అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. కేవలం టాలెంట్ తో సిని పరిశ్రమకు సంబంధించిన హీరోగా పైకి ఎదుగుతున్నాడంటే వారిని తొక్కేయడానికి నానా ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమవుతారట. అంతేకాదు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా నిర్మాతలను చేతిలో పెట్టుకుని ఆడించే ఆనవాయితి కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఇదంతా లోలోపల మాత్రమే పైకి మాత్రం చాలా ఉదాసీనతగా కనిపించే పరిశ్రమ వ్యక్తులు లోలోపల రాజకీయాలు చేసి టాలెంట్ ఉన్నా సరే వారి కెరియర్ ను నాశనం చేసేస్తున్నారట.ఇక తాము చెప్పి నట్టు నడుచుకునే వ్యక్తులకు మాత్రం బాగా సపోర్ట్ ఇచ్చుకుంటూ అతని హిట్ కు కావాల్సినంత సపోర్ట్ కూడా ఇస్తారని టాక్. అంతెందుకు మొన్నటికి మొన్న ఓ రాజకీయ కుటుంబానికి చెందిన హీరో తాను తలచుకుంటే రాజమౌళితో సినిమా తీయగలనని అన్నాడు. అంటే రాజమౌళితో సినిమా అంటే ఒకరు తలచుకుంటే అవుతుందా అన్న ఆలోచన కూడా వస్తుంది. అయితే ఆ హీరో అన్న మాటల ప్రకారం రాజకీయాలకు సినిమాకు చాలా దగ్గర సంబందాలు ఉన్నాయని.. రాజకీయ శక్తులకు కట్టుబడే ఏ చిన్న సినిమా అయినా థియేటర్స్ లో ఆడుతుందని వివరణకు వస్తుంది. అయితే ఇవన్ని తెలిసినా ఏమి చేయలేక సినిమా హిట్ అయితే ఆనందపడి.. ఫ్లాప్ అయితే నిరుత్సాహపడే సగటు నటులు ఎంతమందో ఉన్నారు. మరి వారందరు కళ్లు తెరచి మెసులు కుంటే బెటర్ లేదంటే నీలి నీడలు కమ్ముకుని కెరియర్ అస్థవ్యస్థంగా మారే అవకాశం ఉంది.. బి ఎలర్ట్..!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com