ప్రయాణానికి ముందే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇలా సరి చూసుకోవాలి

- July 28, 2021 , by Maagulf
ప్రయాణానికి ముందే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇలా సరి చూసుకోవాలి

కువైట్: కువైట్ ఆమోదించిన విధంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందడానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇండియా నుంచి కువైట్ వెళ్ళేవారికి ఇచ్చే వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో ఆ సర్టిఫికెట్ చెల్లుబాటయ్యేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. క్యుఆర్ కోడ్ ఇందులో అతి ముఖ్యమైనది. ఆ కోడ్, కోవిన్ పోర్టల్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. కోవిన్ పోర్టల్‌లోకి వెళ్ళి, అక్కడ కనిపించే స్కాన్ క్యుఆర్ కోడ్ అనే చోట ప్రెస్ చేయాలి. క్యుఆర్ కోడ్, బార్ కోడ్ సమర్పించాలి. స్కాన్ క్యు ఆర్ కోడ్ అని క్లిక్ చేయాలి. డివైజ్ కెమెరా కోసం నోటిఫికేషన్ వస్తుంది. డివైజ్ కెమెరా ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్‌ని కెమెరా ముందు వుంచి  క్యుఆర్ కోడ్ కనిపించేలా చూడాలి. వెరిఫికేషన్ విజయవంతమైతే, సర్టిఫికెట్ కనిపిస్తుంది. లేకపోతే, సర్టిఫికెట్ ఇన్‌వ్యాలీడ్ అని వస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com