'మారన్' ఫస్టులుక్ విడుదల..!
- July 28, 2021
తమిళంలో విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే హీరోగా ధనుశ్ కనిపిస్తాడు. ఒక వైపున తనకి గల మాస్ ఇమేజ్ ను కాపాడుకుంటూనే ఆయన కొత్త కథలను ఎంచుకుంటూ ఉంటాడు. అలా ఈ మధ్య కాలంలో ఆయన చేసిన 'అసురన్' .. 'కర్ణన్' చిత్రాలు అక్కడ మంచి ఫలితాలను దక్కించుకున్నాయి. ధనుశ్ చేసిన మరో సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున ధనుశ్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాకి ఃమారన్ః అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుశ్ యాక్షన్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. 'అతని ధైర్యమే అతని ఆయుధం' అంటూ ధనుశ్ పాత్రను గురించి కార్తీక్ నరేన్ హింట్ ఇచ్చాడు. కెరియర్ పరంగా ధనుశ్ కి ఇది 43వ సినిమా. అర్జున్ - త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







