మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి ..
- March 11, 2016
: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫుడ్ కోర్టు నిర్వహణకు పోలీసు అనుమతులతో పాటు మరో తొమ్మిది విభాగాల అనుమతి తప్పనిసరంటూ సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ముఖ్యంగా ఈ మొబైల్ ఫుడ్ కోర్టుల వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా వ్యాపారాన్ని నిర్వహించే వారు తప్పనిసరిగా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి అనుమతిని తీసుకోవాలని సీపీ జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. లైట్ మోటర్, మీడియం మోటర్ , హెవీ మోటర్ వెహికిల్‌పై ఫుడ్ కోర్టును నిర్వహించే వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని సీపీ వెల్లడించారు.మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘిస్తే చర్యలుంటాయని చెప్పారు. కొత్త నిబంధనల వివరాలివి.. స్థానిక ఆర్టీఏ నుంచి ఫుడ్‌కోర్టు యజమానులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. తాజాగా రోడ్డు టాక్స్‌ను కట్టిన రశీదును జత చేయాలి. జీహెచ్ఎంసీ, స్థానిక ప్రభుత్వ విభాగాల అనుమతి తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఆహార నాణ్యతను పాటించాలి. ట్రేడ్ లైసెన్స్‌లను తీసుకోవాలి. జీహెచ్ఎంసీ అనుబంధ సంస్థ విభాగం ఆరోగ్య డిపార్ట్మెంట్ నుంచి ఎన్వోసీ పొందాలి. వ్యాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ, తప్పని సరిగా కమర్షియల్ సిలిండర్ల వాడకం. గ్యాస్, ఎలక్ట్రీక్ సేఫ్టీ సర్టిఫికెట్.వ్యాపారాన్ని నిర్వహించే ప్రాంతానికి సంబంధించిన లోకేషన్‌ను మ్యాప్‌ను పొందుపర్చడం ఫుడ్ కోర్టు వాహనాలు ప్రధాన రోడ్డుకు 60, 100 అడుగులో దూరంలోనే పెట్టుకోవడం వంటి నిబంధనలు పెట్టారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







