ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు

- July 30, 2021 , by Maagulf
ఏపీలో రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా నైట్ క‌ర్ఫ్యూను మ‌రోసారి పొడిగించారు.రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ కర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.ఆగ‌స్టు 14వ తేదీ వ‌ర‌కు ఈ నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.  క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఏపీలో రోజువారీ కేసులు 2 వేల వ‌ర‌కు న‌మోదవుతున్నాయి.అయితే, కేర‌ళలో రోజువారీ కేసులు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డం, అటు క‌ర్నాట‌క‌లో కూడా పాజిటివ్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండటంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com